Google

Thursday, April 9, 2009

చక్కిలిగింత పాట

ఇల్లు అలికి - ముగ్గు వేసి
పీట వేసి - ఆకు వేసి
పప్పు వేసి - పాయసం పెట్టి
అన్నం పెట్టి - అప్పచ్చి పెట్టి
పాలు పెట్టి - పెరుగు వేసి
కూర వేసి - చారు పెట్టి
నెయ్యి వేసి - ముద్దా జేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి కడిగి
చెయ్యి తుడిచి - మూతి తుడిచి
తాతగారింటికి - దోవేదంటే
అత్తారింటికి - దోవేదంటే
ఇటు పోయి - అటు పోయి
ఇదిగో వచ్చాం - అదిగో వచ్చాం
చంకా ఎత్తి - చక్కిలి గిలి గిలి
చక్కిలి గిలి గిలి - చక్కిలి గిలి గిలి

- చాలా ఇళ్ళల్లో పాడుకునే పాట. ఇందులో ఏమి తినాలి, తిన్న తర్వాత ఏమి చెయ్యాలి అన్నదీ పాట రూపం లో పిల్లలకు చెప్పడానికి రూపొందిచారు.

No comments: